Header Banner

పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు.. ఆ మరుక్షణమే కొట్టి చంపేశారు.!

  Tue Apr 29, 2025 22:10        India

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంటే ప్రజలు ఎలా మండిపడుతున్నారో చెప్పే ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిపై కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడితో సహా పది మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. మంగళూరు శివార్లలోని కుడుపు గ్రామంలో భట్ర కల్లూర్తి ఆలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అక్కడ జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో మృతుడికి, సచిన్ అనే మరో వ్యక్తికి మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకుంది. అది తీవ్ర ఘర్షణగా మారి, కొందరు గుంపుగా చేరి బాధితుడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి, కాళ్లతో తన్నారు. సాయంత్రం ఆలయ సమీపంలో బాధితుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్.. తలో చేయి వేసిన బ్యాటర్లు... కేకేఆర్ భారీ స్కోరు!

 

ఈ ఘటనను కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ధృవీకరించారు. క్రికెట్ మ్యాచ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' అని అరిచినందుకు కొందరు దాడి చేశారని, బాధితుడు తర్వాత మరణించాడని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. 10-12 మందిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ, పోస్టుమార్టంలో తీవ్ర గాయాల వల్లే మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు. వెన్నుపై పదేపదే కొట్టడం వల్ల అంతర్గత రక్తస్రావం, షాక్‌తో మరణించినట్లు నివేదిక వెల్లడించిందని తెలిపారు. ప్రధాన నిందితుడైన సచిన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది నేరంలో పాల్గొనడంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కఠిన సెక్షన్లు నమోదు చేశామని, దీని కింద జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉందని వివరించారు. స్థానికుడి ఫిర్యాదు మేరకు 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా ఆధారంగా పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia